- Advertisement -
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏప్రిల్ మాసం ఎండాకాలం కావటంతో ఉదయం నుంచి ఎండ వేడిమికి స్థానికులు ప్రజలు తట్టుకోలేక పోయారు. మద్యాహ్నం నుంచి అనూహ్యంగా ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆకాశంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనితో ఉరుములు మెరుపులతో శ్రీశైలంలో గంటపాటు భారీ వర్షం కురిసింది.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రధాన రహదారులు ఆలయ పరిసర ప్రాంతాలు నిర్మాణుషంగా మారాయి. అకాల వర్షం కారణంగా శ్రీశైలం పరిసర ప్రాంతాలు వాతావరణం చల్లడింది. ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలు శ్రీశైలంలో భారీ వర్షం కురవటంతో గృహాలలో ఉండి చల్లదనాన్ని ప్రజలు ఆస్వాదించారు.
- Advertisement -