సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ..

533
- Advertisement -

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు.

– తెలంగాణ ఐకెపి విఓఎలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. రాష్ట్రంలో మొత్తం 17261 మంది విఓఏలున్నారు. వారికి నెలకు మూడు వేల రూపాయల వేతనం వస్తుంది. దీంట్లోంచి వారు ఒక్కొక్కరు వేయి రూపాయలు విరాళంగా ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐకెపి విఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమవారం ప్రగతి భవన్‌లో అందించారు.

– రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరుఫున కోటి రూపాయల విరాళాన్ని అందించారు. స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్. అనిత దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

– తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.

– తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి జి.రంజిత్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.

– యూనిక్ ట్రీస్ రూ.25 లక్షల విరాళం అందించింది. యూనిక్ ట్రీస్ అధ్యక్షుడు రామ్ దేవ్ చెక్కును సిఎంకు అందించారు.

– తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) కోటి రూపాయల విరాళం అందించింది. దినికి సంబంధించిన చెక్కును టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవిందర్ రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కోటి రూపాయల్లో 88 లక్షల రూపాయలు బ్యాంకు విరాళం కాగా, 8.5 లక్షలు బ్యాంకు ఉద్యోగులు, 3.5 లక్షల రూపాయలు రవిందర్ రావు అందించారు.

– డిసిసిబిలు, సింగిల్ విండోలు కలిపి 76 లక్షల రూపాయలు అందించాయి. డిసిసిబి చైర్మన్లు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున, సింగిల్ విండో చైర్మన్లు 5వేల రూపాయల చొప్పున, ఉద్యోగులు ఒక రోజు వేతనం చొప్పున అందించారు.

-రెడ్డీస్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల విలువైన మందులు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్, ఎండి జివి ప్రసాద్ ముఖ్యమంత్రికి అందించారు.

– ఎమ్ఎస్ఎన్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల మందులు, ఇతర మెడికల్ సామాగ్రి అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను ల్యాబ్స్ చైర్మన్ ఎమ్.సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.

-ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్ సమరిటాన్స్ ఆఫ్ ఖమ్మం’ పేరిటి ఏర్పడి రెండు కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. ఇందులో కోటి 75 లక్షలు విరాళాలు రాగా, 25 లక్షలను మమత వైద్య విద్యా సంస్థలు అందించారు. రెండు కోట్ల రూపాయల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు.

-అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఎ.జలంధర్ రెడ్డి 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

-డిఇసి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఎండి అనిరుధ్ గుప్తా 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

-కెపిసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండి కె.అనిల్ కుమార్ 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

-ఎస్ఎల్ఎంఐ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి బి. వెంకటరెడ్డి 25 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.

-శ్రీ వెంకటేశ్వర కన్ స్ట్రక్షన్స్ ఎండి ఎం.రవీందర్ రెడ్డి 25లక్షల చెక్కును సిఎంకు అందించారు.

-సీల్ వెల్ కార్పొరేషన్ ఎండి బంగారు సుబ్బారావు 25లక్షల రూపాయల చెక్కును సిఎంకు అందించారు.

- Advertisement -