కేటీఆర్‌ని కలిసిన కోలేటి దామోదర్..

120
ktr

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ని కలిశారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్. కరోనా నివారణ ఫండ్ కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్‌ని కేటీఆర్‌కి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా కరోనా నివారణకు సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. దీంతో తెలంగాణలో చాలామంది కరోనా బారిన పడకుండా కాపాడుకోగలిగామని ఇది సీఎం ముందుచూపుకు నిదర్శనమని చెప్పారు.

అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపడమే కాదు కరోనా నివారణ చర్యలను సమర్దవంతంగా నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు పొందారని చెప్పారు. ఈ గౌరవం దేశంలో మరే ముఖ్యమంత్రికి దక్కలేదన్నారు.