తుంగభద్రకు భారీగా వరద నీరు..

591
- Advertisement -

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నది నిండు కుండలా మారింది. దీంతో తుంగభద్ర డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సైతం 1,55,431 క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ రోజు దిగువన కురుస్తున్న వార్షాలకు వరద ఉదృతి పెరిగే అవకాశం ఉండటంతో 2 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డ్ అధికారులు తెలిపారు. డ్యాంలో ప్రస్తుతం 100.663 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.

Tungabhadra River

తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీరు బుధవారం నాటికి ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకోనుంది. అక్కడి నుంచి సుంకేసుల బ్యారేజీకి వరద చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర నదితీర ప్రాంత ప్రజలను నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తుంగభద్ర బోర్డ్ అధికారులను కోరింది.

- Advertisement -