ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎండల కారణంగా డీహైడ్రేషన్ కు లోనై వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎండలో పని చేసే వారికి లేదా తరచూ బయట తిరిగే వారికి వడదెబ్బ తగలడం సహజం. కానీ ఇంట్లో ఉండే వారికి కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇంట్లో ఉండేవారు సైతం ఎంతో జాగ్రత్త వహించాలి. ఇంట్లో ఉండేవారు డోర్స్ ఎప్పుడు తెరచే ఉంచాలి. .
ఎందుకంటే డోర్స్ వేసుకోవడం వల్ల రూమ్ లో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. ఫ్యాన్, కూలర్ వంటివి వేసుకున్నప్పటికి ఆక్సిజన్ శాతం తక్కువౌతుంది. తద్వారా ఉక్కపోత పెరిగి తల తిరగడం లేదా మైకం కమ్మడం జరుగుతుంది. ఈ పరిణామలే వడదెబ్బకు కూడా దారి తీస్తాయి. అందువల్ల ఇంట్లో ఉండేవారు తలుపులను తెరచి ఉంచడం మంచిది. ఇంకా ఇంట్లో ఉండేవారు నీరు తక్కువగా తాగుతుంటారు. అందువల్ల డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బయట ఉన్న లేదా ఇంట్లో ఉన్న నీరు త్రాగే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శరీరానికి తగినంతా నీరు అందించినప్పుడే ఎలాంటి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా ఇమ్యూనిటీని పెంచే పండ్ల రసాలు, ఫ్రూట్స్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండే వారు కూడా వడదెబ్బ విషయంలో సరైన జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:NBK:బాలయ్య హ్యాట్రిక్ కొట్టేనా?