ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత మనందరికీ తెలిసిందే. అయితే వాస్తవ విషయానికి వస్తే మనకు ఉల్లి కంటే తల్లే ఎక్కువ ముఖ్యం కదా. కానీ అలా అని చెప్పి ఉల్లిని కూడా తక్కువ చేయలేం. ఎందుకంటే దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి మరి. ఈ క్రమంలో ఉల్లిపాయలను ఉపయోగించి మనకు కలిగే అనారోగ్యాలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఇలా చేస్తే ఉల్లిపాయతో షుగర్ కంట్రోలు చేయవచ్చు… రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఆహారంగా తీసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం అన్నంలో నుంచుకుని తింటే ఇంకా మంచింది. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు ఉల్లితింటే షుగర్ కంట్రోల్ అవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉల్లి పాయలు యాభైగ్రాములు ఒక్కేసారి తినలేకపోతే సమయం తీసుకుని పొద్దున్న, మధ్యాహ్నం సాయంత్రం కొంచెం కొంచెం తింటూండాలి. పచ్చి ఉల్లి పాయలు తినలేకపోతే పచ్చిపులుసు చేసుకుని అన్నంతో పాటు తింటే సరిపోతుంది.ఈ విధంగా చేస్తే షుగర్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు… ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు రెండు లేక మూడు సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి. పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా పురుషుల్లో వీర్యకణాల సమస్య తగ్గిపోయి. పడక గదిలో జోష్ వస్తుంది.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రావు. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా రావు.
ఇవి కూడా చదవండి..