పెసరపప్పు ఉపయోగాలు తెలుసా?

125
- Advertisement -

మనం తినే వంటల్లో పెసర పప్పుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పెసరపప్పుతో చేసిన వంటలు ఎంతో రుచిని కలిస్తాయి. అందరికి బాగా ఇష్టమైన పెసరట్టును తినని వారుండరు. ఇక పెసర పప్పుతో చారు, సలాడ్, కర్రిస్ వంటి వాటిలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇంకా పెసరపప్పు యొక్క మొకలలను ఉదయం సాయంత్రం స్నాక్స్ రూపంలో కూడా తింటూ ఉంటారు చాలమంది.. పెసర పప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన శరీరనికి అవసరమైన అన్నీ పోషకాలు పెసరపప్పు ద్వారా లభిస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ బి2, బి3, బి5, బి6 లతో పాటు ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్ వంటికి కూడా మెండుగా ఉంటాయట.

Also Read:హ్యాపీ బర్త్ డే టూ.. సూపర్ స్టార్ మహేష్

ఇంకా ఇందులో ఉండే యామినో యాసిడ్స్ మరియు, యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలను దూరం చేయడంలో పెసరపప్పు ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతాంగా పోరాడతాయి. అంతే కాకుండా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఇక పెసరలో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటివి రక్తపోటును నియంత్రించడంతో పాటు మలబద్దకం వంటి ఉదర సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇంకా పెసరపప్పులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మొలకెత్తిన పెసర ను ప్రతిరోజూ తినడం వల్ల కండపుష్టి కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న పెసరపప్పును ప్రతిరోజూ వంటల్లో చేర్చుకోవడం మంచిదేనని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -