నోటిపూతతో ఇబ్బందా..అయితే ఓసారి!

5
- Advertisement -

పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య నోటిపూత. కొందరిలో ఈ సమస్య చాలా అరుదుగా ఉండగా మరికొందరిని మాత్రం తరచూ వేధిస్తూనే ఉంటుంది. నోటిపూత సమస్య కారణంగా సరిగా ఆహారం తినలేరు.అలాగే నోటి నుంచి దుర్వాసన, నోరు పొడిబారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నోటి శుభ్రత లేకపోవడం, కొన్నిసార్లు తినే ఆహారం పడకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటివి నోటిపూత రావడానికి ప్రధాన కారణాలు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా నోటిపూత సమస్యకు చెక్ పెట్టవచ్చు. తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

నోటిపూత ను తగ్గించడానికి కొబ్బరి నూనె కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఉదయం సాయంత్రం రెండేసి సార్లు పుక్కిలిస్తే ఈ సమస్య తగ్గుతుంది.

Also Read:స్కందగిరి ఆలయంలో గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

పాల పదార్థాలతో సైతం నోటిపూత సమస్యను తగ్గించుకోవచ్చు. సమస్య ఉన్న చోట నెయ్యి రాయడం, ప్రతిరోజూ రెండుమూడు సార్లు ఒక గ్లాస్ చొప్పున మజ్జిగ తాగడం చేస్తే తొందరగా ఉపశమనం లభిస్తుంది. నోట్లో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకోవాలి. ఆ తరువాత నీటితో పాటే తులసి ఆకుల్ని నమలాలి…ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

NOTE : ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే, వీటిని పాటించే ముందు డాక్టర్ల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి.

- Advertisement -