ఫిబ్రవరిలో కరోనా తీవ్రత పెరిగే అవకాశం..

123
Health Secretary Srinivasarao
- Advertisement -

జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో కేసుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని …ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. ఒమిక్రాన్ వలన ఒక్క మరణం కూడా సంభవించలేదని ..ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, కొందరిలో ఇటువంటివేమీ లేవని తెలిపారు.

భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్లు ఉండవని పేర్కొన్నారు. టెస్టుల సంఖ్య పెంచడం వైరస్ వ్యాప్తిని గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు, భౌతికదూరం ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

కరోనా మూడో వేవ్‌ వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలో 41 దేశాల్లో 700లకు పైచిలుకు ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు తెలిపారు శ్రీనివాసరావు.

- Advertisement -