ఎక్స్ రే ఆఫ్ గజ్వేల్ : సీఎం కేసీఆర్

503
kcr
- Advertisement -

గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రజల ఆరోగ్య సూచిక(హెల్త్ ప్రొఫైల్) తయారుచేయాలని మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించారు సీఎం కేసీఆర్. గజ్వేల్‌లో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన మహతి ఆడిటోరియంను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం ఈ హాలుకు మహతి అనే పేరు తానే పెట్టానని తెలిపారు. ప్రజల ఆరోగ్య సూచిక తయారు చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని ఈ స్కీమ్ గజ్వేల్ నుంచే ప్రారంభిస్తామన్నారు.

ప్రతి జిల్లా కేంద్రం,నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్‌లో ఇలాంటి హాలు నిర్మిస్తామని చెప్పారు. త్వరలోనే గజ్వేల్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ఎక్స్‌రే ఆఫ్‌ గజ్వేల్‌లో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాలని….ఇల్లులేని నిరుపేద నియోజకవర్గంలోనే ఉండకూడదన్నారు. ప్రతి గ్రామాన్ని ఎక్స్‌రే తీసి డేటా అందించాలని… నిరుద్యోగ కుటుంబం గజ్వేల్‌లో ఉండకూడదన్నారు.

అద్భుత నియోజకవర్గంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుదామని చెప్పారు. ఇతరులు నేర్చుకునే విధంగా గజ్వేల్‌ అభివృద్ధి ఉండాలన్నారు. రాజకీయ నాయకులు పొగడ్తలకు పొంగి పొవద్దన్నారు. గజ్వేల్‌లో నిరుద్యోగం ఉండకూడదన్నారు. పార్టీలకు అతీతంగా అందరికి సంక్షేమ ఫలాలు అందాలన్నారు.

జనవరిలో గోదావరి జలాలతో గజ్వేల్ ప్రజలు పండగ చేసుకోవాలన్నారు. గజ్వేల్‌ నుంచే చేపలను హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తామన్నారు. అధికారులు త్వరలోనే గజ్వేల్ లోని గ్రామాలకు వచ్చి ప్రజల హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటారని చెప్పారు.

Health Profile scheme starts from Gajwel says CM KCR…Health Profile scheme starts from Gajwel says CM KCR…Health Profile scheme starts from Gajwel says CM KCR

- Advertisement -