వేపాకుతో చిట్కాలు

128
neem leaves
- Advertisement -

1.వేపలో ఉండే విటమిన్ “E” చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తుంది, చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

2. వేపఆకులను ముద్దగా చేసుకొని ముఖం పై రాసుకుంటే మొటిమలు, తెల్లటి ,నల్లటి మచ్చలను తగ్గించు కోవచ్చు.

3. వేప నూనెను క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు తలకు మర్దన చేసుకుంటే వెంట్రుకలు రాలకుండ ఉంటాయి, ఒత్తుగా పెరిగి నిగనిగలాడుతాయి.

4. వేపఆకుపొడిని, నిమ్మరసాన్ని కలిపి ముద్దగా చేసుకొని ముఖం పై రాసుకొని 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్ళతో కడుక్కుంటే ముఖం మీద జిడ్డుని తోలగిస్తుంది.మొటిమలను , ఇన్ఫెక్షన్ ల వల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

5. వేప ఆకుల పొడిని, గంధంపొడి, రోజ్ వాటర్ ను కలిపి ముద్దగా చేసుకోని.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, ఎండే వరకు వేచి ఉండి, నీటితో కడిగే యాలి ఇలా చేస్తే ముఖం అందం, కాంతి వంతంగా తయారవుతుంది.

6. బట్టతల ఉన్నవారు రాత్రి పూట పడుకునే ముందు వేపనూనె ను తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

Also Read:ఇప్పుడు షణ్ముక్ పరిస్థితి ఏమిటి?

7. వేపపూతను ఎండబెట్టి పొడి చేసుకొని రోజుకు గ్లాస్ చొప్పునా తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మధుమేహ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. కడుపు మంటలను తగ్గించడంతో పాటు కడుపులోని హానికరమైన పురుగులను నశింపజేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

8.వేప ఆకులను దంచి, ఆ రసాన్ని తీసుకుని కొబ్బరినూనెలో కలిపి మరగబెట్టాలి. చల్లారిన తరువాత ఈ లేపనం రాసుకుంటే దురదలు తగ్గుతాయి.

9. వేప కొమ్మలతో పళ్లు తోముకుంటే నోటికి హాని కలిగే క్రిములు నాశనం అవుతాయి. అలాగే దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది.

10.రెండు వేప లేత ఆకులను ప్రతి రోజూ ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగి రక్త శుద్ధి జరుగుతుంది. అలాగే చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చు.

 

- Advertisement -