బెల్లంతో ఉపయోగాలు

149
- Advertisement -

బెల్లం అనేది ప్రతిఒక్కరి ఇంట్లో ఉండే ఒక పదార్థం. పండుగల సమయాల్లో చాలా మంది బెల్లంతో రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఇక ఆయా రకాల స్వీట్స్ లో కూడా షుగర్ కంటే బెల్లాన్నే అధికంగా వాడుతూ ఉంటారు. ఇక మరికొందరు బెల్లాన్ని స్నాక్స్ తో కలిపి కూడా తింటూ ఉంటారు. కానీ బెల్లంలో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల బెల్లం తినడానికి కొందరు ఆసక్తి చూపారు. అయితే ప్రతి రోజు బెల్లం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనలు కలిగుతాయి. ముఖ్యంగా మలబద్దకంతో భాడపడేవారు ప్రతిరోజూ మద్యాహ్నం రాత్రి భోజనం తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా మలబద్దకం నుంచి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు, జింక్, సేనిలియమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు, రక్తాన్ని శుద్ది చేయడంలో కూడా దోహదపడతాయి. ఇక బెల్లంలో ఉండే పొటాషియం లివర్ ను శుభ్రపరచడంతో పాటు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బెల్లంలో మెగ్నీషియం, ఐరన్, పోలేట్ లు కూడా సమృద్దిగా ఉంటాయి. వీటి ద్వారా శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జీర్ణాశయం, ఆహారనాళం వంటివి కూడా శుభ్రమౌతాయి. ఇక బెల్లంలో ఉండే పోషకాలు మహిళల్లో వచ్చే ఋతు సమస్యలను కూడా తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఉండే ఔషధగుణాలు శరీరంలోని వేడిని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరుస్తుంది. అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్న బెల్లాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:జింక్ లోపమా..ఇవి తినండి!

 

- Advertisement -