వింటర్‌లో చిలగడదుంప తింటే ఎన్ని లాభాలో!

13
- Advertisement -

దుంప జాతికి చెందిన వాటిలో చిలగడదుంప కూడా ఒకటి. చూడటానికి బంగాళదుంపను పోలి ఉన్నప్పటికి రుచిలో మాత్రం చిలగడదుంప తీపిని కలిగి ఉంటుంది. ఇవి వింటర్ సీజన్ లో ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిని ఈ చలికాలంలో తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ వింటర్ సీజన్ లో మన ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇక ఆయా ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా చిలగడదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. .

ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. ఇంకా దృష్టి లోపం ఉన్నవారు తప్పనిసరిగా చిలకడదుంపలు ఉడికించి తినాలి. ఇందులో ఉండే విటమిన్ ఏ, బీటాకెరోటిన్.. వంటివి కంటిచూపును పెంచుతాయి. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చిలకడదుంపలు ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి వింటర్ లో తప్పనిసరిగా చిలగడదుంప ను తినడం మంచిదని చెబుతున్నారు ఆహార నిపుణులు. అయితే వీటిని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తింటేనే మేలు. పచ్చిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.

Also Read:ఫాంటసీ ప్రపంచంలోకి ..#యూఐ

- Advertisement -