ఎండు ద్రాక్ష.. ఆరోగ్యానికి ఎంతో మేలు !

93
- Advertisement -

డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష చాలా స్పెషల్. దీనిని చాలమంది ఎంతో ఇష్టంగా తింటూఉంటారు. వివిధ రకాల వంటకాలలోను, స్వీట్స్ తయారీలోనూ ఎండుద్రాక్షను ఉపయోగిస్తూ ఉంటారు. ఎండుద్రాక్షలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఎండు ద్రాక్షను ఆయుర్వేద ఔషధ తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా అన్నీ సీజన్స్ లోనూ మార్కెట్ లో లభించే ఎండుద్రాక్ష ఎన్నో పోషకాల సమ్మేళనం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలతో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.

Also Read:చంద్రబాబు ” మర్డర్ ప్లాన్ “..ఎవరిది?

ఎండు ద్రాక్ష తియ్యగా ఉన్నప్పటికి ఇందులోని లాక్టోజ్, ఫ్రక్టోజ్ కలయిక కారణంగా ఫ్యాట్ సమస్య ఉండదు. ఇందులోని కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని ఇవ్వడంలో తోడ్పడతాయి. రక్త హీనతతో బాధపడేవాళ్ళు ప్రతిరోజూ నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే బాడీలో ఐరన్ శాతం పెరిగి రక్త హీనత దూరమౌతుంది. ఎండు ద్రాక్షలో పీచు శాతం కూడా అధికంగానే ఉంటుంది అందువల్ల జీర్ణ సమస్యలు అనగా మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇక ఎండుద్రాక్షలో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. ఇంకా లివర్ మరియు కిడ్నీల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మరియు విటమిన్ ఏ, బీటా కెరోటిన్ వంటి వాటి కారణంగా కంటి సమస్యలు కూడా దూరం అవుతాయట. కాబట్టి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే శరీరానికి కావల్సిన అన్నీ పోషకాలు పుష్కలంగా అందుతాయని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.

Also Read:యువతే టార్గెట్‌గా బీజేపీ ప్లాన్?

- Advertisement -