తలనొప్పి అనేది సాధారణ సమస్యగా చాలమంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. అందుకే తలనొప్పి సంభవించిన ప్రతిసారి టీ లేదా కాఫీ తాగుతూ తక్షణ రిలాక్స్ పొందుతూ ఉంటారు. అయితే ఎప్పుడొకసారి సంభవించే తలనొప్పి సాధారణ సమస్యే. కానీ వారంలో మూడు లేదా నాలుగు రోజులు తరచూ తలనొప్పి వేధించడం ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం. ఈ తలనొప్పిలో చాలానే రకాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ తెలిసినది మైగ్రేన్. ఇది మాత్రమే కాకుండా చాలమందికి తెలియని విషయం ఏమిటంటే లోబీపీ ఉన్నవారిలో కూడా తలనొప్పి ప్రాథమిక లక్షణంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లోబీపీని హైపోటెన్షన్ అని కూడా అంటారు. ఇది వయసు పైబడే కొద్ది చాలమందిలో కనిపిస్తూ ఉంటుంది. కొందరికి వయసుతో సంబంధం లేకుండా కూడా లోబీపీ సమస్య వేదిస్తుంది. ఆకస్మిక మైకం, నిరంతర తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, అలసట.. ఇవన్నీ కూడా లోబీపీ లక్షణాలే.
ఈ లోబీపీ సమస్య రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి.. విటమిన్ బి12 లోపం, మహిళలకు పీరియడ్స్ లో అధిక రక్తస్రావం కావడం. మాదకద్రవ్యాలు అతిగా సేవించిన లోబీపీ బారిన పడే అవకాశం ఉంది. లోబీపీ కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. అధిక మూత్ర విసర్జన, వికారం, వాంతులు వంటివి సంభవిస్తాయి. ఈ హైపోటెన్షన్ సమస్యను తేలికగా తీసుకుంటే కొన్ని సందర్భల్లో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లోబీపీని అధిగమించడానికి సరైన జాగ్రత్తలు ఎంతో అవసరం. మంచి పౌష్టికాహారం తినడం, విటమిన్ బి12 అధికంగా ఉండే బ్రోకలి, క్యాబేజీ, క్యారెట్.. వంటివాటిని ఆహార డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇంకా వీటితో పాటు పప్పుదినుసులు, గుడ్లు, చేపలు వంటివి కూడా తినాలి. అప్పుడే లోబీపీ నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:TDP:కడపలో టీడీపీ పరిస్థితేంటి?