హెచ్‌సీఏ ఎన్నికలు..సర్వం సిద్ధం

43
- Advertisement -

ఇవాళ హెచ్‌సీఏ ఎన్నికలు ఇవాళ జరగనుండగా సర్వం సిద్ధమైంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా హెచ్సీఏ ఎన్నికలు జచగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానెల్స్ బరిలో ఉండగా ప్రెసిడెంట్ ,వైస్ ప్రెసిడెంట్ ,సెక్రెటరీ,జాయింట్ సెక్రెటరీ,కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం..

హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 ఇన్‌స్టిట్యూషన్స్‌, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సిఏ ప్యానల్ నుండి అధ్యక్ష పదవికి పోటీకి దిగారు అర్సనపల్లి జగన్మోహన్ రావు. ప్రస్తుతం జాతీయ హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు జగన్ మోహన్ రావు.

హెచ్సీఏలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సహకారంతో హెచ్సీఏ అభివృద్ధికి పాటుపడుతానని ఇప్పటికే ప్రకటించారు జగన్ మోహన్ రావు. అధ్యక్ష బరిలో జగన్ మోహనరావు తో పాటు అమర్నాథ్ , అనిల్ కుమార్ , పీఎల్ శ్రీనివాస్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుండగా , సాయంత్రం 6 గంటలలోపు ఫలి తాలు వెలువడే అవకాశముంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్ష ణలో జరుగుతున్న ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్: ఈ మూడు చోట్ల ‘బాద్ షా’ లే?

- Advertisement -