హ్యాపీ బర్త్ డే..నటకిరిటీ రాజేంద్రప్రసాద్

62
- Advertisement -

వెండితెర నవ్వులకు పట్టాభిషేకం చేసిన రారాజతడు. తన అద్భుత నటనతో ఎర్రమందారాలు పూయించిన మాయలోడు. తెలుగు చాప్లిన్..అతడే నటకిరిటీ రాజేంద్రప్రసాద్. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

రాజేంద్రప్రసాద్.. పేరు వినగానే తెలియకుండానే నవ్వేసుకుంటాం.. కామెడీకి హీరోయిజం ఆపాదించిన తొలి హీరో . పొట్ట చెక్కలయ్యేలా నవ్వుల విందుపెట్టిన రాజేంద్రుడు పుట్టింది కృష్ణా జిల్లా నిమ్మకూరులో. మహానటుడు ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో జన్మించిన రాజేంద్రప్రసాద్‌ను నటుడిగా కాదు ఇంకేదైనా ఉద్యోగం చేసుకోమన్నారు ఎన్టీఆర్. అయితే అవేమీ పట్టించుకోని రాజేంద్రప్రసాద్ యాక్టింగ్ స్కూల్లో చేరి.. ఎన్నో అవార్డులూ గెలుచుకుని కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాలు అంతగా కలిసిరాకపోయిన వచ్చిన ప్రతీ ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకుంటూ అశేష తెలుగు ప్రజల అభిమానాల్ని పొందారు.

Also Read:KTR:భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండండి

లేడీస్ టైలర్ చిత్రంతో రాజేంద్రప్రసాద్ కెరీర్‌ మారిపోయింది. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. జంధ్యాల రూపొందించిన రెండురెళ్లు ఆరుతో మొదలు పెట్టి వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నవ్వులతో కన్నీళ్లు పెట్టించాయి. కామెడీ హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేసిన ఎర్రమందారం అతనిలోని నటుడ్ని గొప్పగా ఆవిష్కరించింది. రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు సినిమాలతో మెస్మరైజ్ చేశాడు. మిస్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం లాంటి సినిమాలు ఇప్పటికి,ఎప్పటికి ఎవర్‌గ్రీన్ మూవీలే. ఓ దశంలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సైతం తన మనసు బాగాలేనప్పుడు రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూస్తానని చెప్పడం విశేషం.

దర్శకుడిగా మేడమ్ లాంటి ప్రయోగాత్మక సినిమాతో శెభాష్ అనిపించుకున్నాడు.. నిర్మాతగా రాంబంటు లాంటి చిత్రంతో అభిరుచినీ చాటుకుని, అద్భుతమైన నటన చూపించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ఆరు మెట్లు ఎక్కించిన ది గ్రేట్ కామెడీ హీరో…ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మరెన్నో చేయాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.

Also Read:పి‌ఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ కష్టమే?

- Advertisement -