క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆమ్లా..

485
hashim amla
- Advertisement -

ఓ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ముగిసింది. సఫారీ జట్టు వాల్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన  స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఆమ్లా. దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతాడని ప్రకటించాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో ఆమ్లా అన్ని ఫార్మాట్లలో కలిపి 349 మ్యాచ్‌లు ఆడాడు. 18 వేలకు పైగా పరుగులు చేశాడు. 124 టెస్టుల్లో 46.64 సగటుతో 9282 పరుగులు చేశాడు. ఇందుల్లో 28 సెంచరీలున్నాయి. 181 వన్డేల్లో 8113 పరుగులు చేసిన ఆమ్లా సఫారీ జట్టులో చెరగని ముద్రవేశారు. టెస్టు ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఆమ్లా.

15ఏళ్ల పాటు తనకు ఇటువంటి అవకాశం వచ్చేలా చేసిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు ఆమ్లా. తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, తనను ప్రోత్సహించిన స్నేహితులకు, సన్నిహితులకు టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పాడు. దక్షిణాఫ్రికా టీమ్ తరపున ఆడడం నాకు ఎంతగానో సంతృప్తి ఇచ్చిందన్నారు.

- Advertisement -