ట్విట్టర్ రివ్యూ : మన్మథుడు 2

578
manmadhudu 2
- Advertisement -

కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన్మథుడు 2. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై తెరకెక్కగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక సినిమా ప్రిమయర్‌ షో చూసిన వాళ్లు రేటింగ్ ఇచ్చేస్తున్నారు. సినిమా ఎలా ఉంది…? మన్మథుడుగా నాగ్ మరోసారి ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

రాహుల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించావ్‌.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టావ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. నాగార్జున ఫుల్ ఎంటర్‌టైన్ చేశారని,ప్లే బాయ్‌గా కొత్త అవతారంలో మెప్పించారని ట్వీట్ చేస్తున్నారు. లేటు వయసులో ఘాటు ముద్దులతో రచ్చ చేశారని పోస్టు చేస్తున్నారు.

Image result for manmadhudu 2.

నాగ్ చాలా అందంగా కనిపించారని…ఫస్టాఫ్ ఫుల్ ఫన్‌తో మెప్పించారని సెకండాఫ్ పై కాస్త దృష్టి పెడితే బాగుంటుందని మరికొంతమంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి పాజిటివ్‌ టాక్‌తో మన్మథుడు 2గా నాగ్ మరోసారి తన మార్క్ నటన చూపించారని చెబుతున్నారు నెటిజన్లు.

- Advertisement -