కాజల్ ప్రపోజల్…వైఫ్‌ ఎంట్రీతో వెనక్కితగ్గిన విష్ణు..!

429
manchu vishnu kajal

మంచు ఫ్యామిలీలో మరో చిన్నారి రాబోతోంది. త్వరలో హీరో మంచు విష్ణు సతీమణి విరోనికా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తండ్రైన విష్ణు కొద్ది రోజుల క్రితం తన భార్య గర్భవతిగా ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాజల్ అగర్వాల్ ..తన భార్య డెలివరీ గురించి క్రేజీగా ఐడియా ఇచ్చిందని… తన భార్య బిడ్డను ప్రసవించే సమయంలో ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్ టెలీకాస్ట్ ఇవ్వాలని కోరిందని తెలిపారు. కాజల్ సూచనల మేరకు సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

అయితే విష్ణు ట్వీట్ పై విరోనికా స్పందించింది. అలా చేస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అని కామెంట్ పెట్టింది. అంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటే వెనక్కి తగ్గక తప్పదు. ఎందుకంటే విరోనికకు తన తండ్రి మోహన్ బాబు సపోర్ట్ ఉందని తెలిపారు విష్ణు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.