హర్యానా రాష్ట్రంలోని తౌరు సమీపంలో పచ్‌గావ్ ప్రాంతంలోని ఆరావళి కొండలపై అక్రమ మైనింగ్‌ను అపేందుకు డీఎస్పీ, ఇద్దరు పోలీసులు, ఓ డ్రైవర్, గన్‌మెన్‌తో కలిసి అనుమానాస్పద డంపర్‌ను గుర్తించి దానిని ఆపమని సంకేతాలిచ్చారు. అతను కాగితాల కోసం డ్రైవర్‌ను అడిగాడు కాని అంతలోనే డంపర్ వాహనంతో వేగంగా పోలీసుల వాహనంపైకి దూసుకేళ్లాడు. కాని డీఎస్పీ అక్కడిక్కడే తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాని డ్రైవర్, గన్‌మెన్ తప్పించుకొగలిగారు. మైనింగ్ మాఫియా పోలీసులపై దాడికి నూహ్ జిల్లా పేరుగాంచింది. 2015 నుంచి ప్రతి సంవత్సరం సగటున 50 ఫిర్యాదులు నమోదవుతుంటాయని అధికారులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సురేందర్ సింగ్ 1994లో హర్యానా పోలీస్‌లో అసిస్టెంట్-సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిక్రూట్ అయ్యారు. అతను ప్రస్తుతం డీఎస్పీ, తౌరులో పోస్టింగ్ చేస్తున్నారు. సింగ్ నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయవలసి ఉంది. ఇంతలోనే అతను దుర్మరణం చెందడం రాష్ట్ర పోలీసులను దిగ్బ్రాంతికి గురయ్యారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొన్న పోలీసులు… డంపర్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం నూహ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు.
హర్యానా కాంగ్రెస్ నాయకుడు, భూపీందర్ హుడా ట్వీటర్ ద్వారా దీనిని ఖండించారు. ఇది సిగ్గుచేటు. మైనింగ్ మాఫియా చేతులెత్తేసింది. శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోంది. ఎమ్మెల్యేలకు బెదిరింపులు, పోలీసులకు కూడా భద్రత లేదు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని ఎలా భావిస్తారు? ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.