హర్యానాలోని నుహ్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీ సురేందర్ సింగ్‌ను అమరవీరుడిగా గుర్తించింది. డీఎస్పీ కుటుంబానికి రూ. కోటి నగదును అందచేయనున్నట్టు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. పరిహారంతో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.
నుహ్ ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న సురేంద్ర సింగ్‌ను మైనింగ్ మాఫియాకు చెందిన డంపర్ డ్రైవర్ వాహనంతో ఢీకొట్టడంతో సింగ్ మరణించారు. కాగా 2009లోనే సుప్రీంకోర్టు అక్రమ మైనింగ్ ఆరావళి పర్వతాల్లో నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ తవ్వకాలను అక్కడి మాఫియా కొనసాగిస్తూనే ఉంది. అక్రమ మైనింగ్‌కు పేరొందిన ఈ ప్రాంతంలో తనిఖీ కోసం సురేంద్ర సింగ్ తన టీంతో కలిసి వచ్చినప్పుడు ఈ దారుణ ఉదంతం చోటుచేసుకుంది.