హీరోయిన్‌గా యాంకర్‌ శ్రీ ముఖి…..

324
- Advertisement -

యాంకర్‌ శ్రీ ముఖి బుల్లితెరపై నానా హంగామా చేస్తుంది. శ్రీముఖి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవర్వు ఉండరు. మొదట్లో మ్యూజిక్స్‌ ఛానల్‌లో టీవీ యాంకర్‌గా పని చేసిన శ్రీముఖి ఆతర్వాత కాస్త విరామం తీసుకుని ఈ టీవీ ప్లస్‌లోని పటాస్‌ అనే కామెడీ షోతో రీఎంట్రీ ఇచ్చింది. యాంకర్‌ రవి, శ్రీముఖి కాంబినేషన్‌లో చేసే ఈకామెడీ షో చాలా పెద్ద హిట్‌ అయ్యింది. బుల్లితెరపై శ్రీముఖి చేసే యాంకరింగ్‌ అంతా ఇంత కాదు…జబర్దస్త్‌లో యాంకర్స్‌ అనసూయ,రష్మీలు పొట్టి పొట్టి డ్రెస్‌లు వెసుకుని ఎంత పేరు తెచ్చుకున్నరో… ఇప్పుడు తన నటన ద్వారా అంతే పేరు తెచ్చుకుంటుంది యాంకర్‌ శ్రీముఖి.

Harshavardhan to direct sree mukhi

ఒకప్పుడు తనకు జబర్దస్త్‌షోలో యాంకర్‌గా అవకాశం వచ్చిన తను వదులుకున్నానని..ఇప్పుడు పటాస్‌షో లో అవకాశం వచ్చినందుకు సంతోషపడుతున్నానని. ఇటీవలే ఒక ఇంటర్వులో చెప్పింది శ్రీముఖి. శ్రీముఖి ఫిజిక్‌ పర్సనాలిటీ ఇవన్ని తనకు ప్లస్‌పాయింట్స్‌ వీటిన్నింటితోనే హాట్‌గా కనిపిస్తుంది ఈ బుల్లితెర యాంకర్‌. రవి అంటే లాస్య, లాస్య అంటే రవి అని బుల్లితెర ప్రేక్షకుల నోటిలో నానే మాటను శ్రీముఖి తూడిచిపెట్టిందనే చెప్పవచ్చు, ఇప్పుడు రవి అంటే శ్రీముఖి, శ్రీముఖి అంటే రవిగా మాట్లాడుకునే లాగా చేసింది యాంకర్‌ శ్రీముఖి. బుల్లితెరపై ఈబ్యూటీ రోమాన్స్‌ సీన్లు కూడా చేస్తుందని సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తుంటాయి. రొమాన్స్‌కు ఏమాత్రం వెనకడుగు వెయ్యదని,… షోలో అసభ్యకరమైన పదజలం వాడుతుందని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.

Harshavardhan to direct sree mukhi

ఇటీవలే శ్రీముఖి హీరోయిన్‌ కావలని తెగ ఆరాటపడిపోతుందట. ఆ మ‌ధ్య ఓ ఫోటో షూట్‌లో త‌న అందాల‌ను ఆర‌బోసి హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆ వీడియోలో శ్రీ‌ముఖి ష‌ర్ట్‌ బట‌న్ విప్పేసి మ‌రీ రెచ్చిపోయింది. ఇదంతా సినిమా అవ‌కాశాల కోస‌మే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా చేస్తేనే యాంక‌ర్ అన‌సూయ‌, యాంక‌ర్ రేష్మిల‌కు సినీ ఆఫ‌ర్లు క్యూక‌ట్టాయి. శ్రీ‌ముఖి కూడా సినిమా చాన్స్ కోసం తెగ ఆరాట‌ప‌డుతోందని అందుకే రొమాన్స్‌కు ఏమాత్రం వెనకడటం లేదని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్స్‌ జోరందుకున్నాయి. రీసెంట్‌గా అల్లుఅర్జున్ హీరోగా వ‌స్తున్న ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ మూవీలో శ్రీ‌ముఖికి సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చింది. కానీ బ‌న్నీ అభ్యంత‌రం చెప్ప‌డంతో ఆ మెగా ఆఫ‌ర్ శ్రీ‌ముఖికి చేజారిపోయింది. దీంతో పాపం పాప ఫుల్ అప్‌సెట్ అయ్యిందట బుల్లితెర బ్యూటీ శ్రీముఖి.

Harshavardhan to direct sree mukhi

అయితే శ్రీముఖి ఒక సినిమాలో హీరోయిన్‌గా చెయబోతుందట. దర్శకుడు హర్షవర్ధన్‌ తెరకెక్కించే హరర్‌ థ్రిల్లర్‌ మూవీలో శ్రీముఖి లీడ్ రోల్‌ చెయ్యనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒక అమ్మాయి తప్ప సినిమా ప్రొడ్యూసర్‌ అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇన్నాళ్లు సినిమాల్లో సపోర్టింగ్‌ క్యారెక్టర్‌లో మెరిసిన శ్రీముఖి లీడ్‌ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడలంటే సినిమా విడుదల అయ్యే అంత వరకు వెచిచూడాల్సిందే మరి.

- Advertisement -