బాహుబలి రికార్డు పదిలం…..

102
BAAHUBALI RECORDS Khaidi No 150

ప్రీమియర్ షో కలెక్షన్లు ద్వారా ఖైదీ, బాహుబలిని బీట్ చేసిందని వార్తలు ఫేక్ అని తేలింది. అయితే.. ప్రీమియర్ షో ల ద్వారా ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసిన సినిమాల రికార్డుల్ని ఖైదీ నెంబర్ 150 దాటేస్తుందని చాలామంది ఆశించారు. బాహుబలి, పీకే సినిమాల రికార్డులను కూడా దాటే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే కొంచెం ఆలస్యంగా అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఎంత కలెక్ట్ అయిందన్న వివరాలు వచ్చేశాయి. మొత్తానికి ఈ సినిమా ప్రీమియర్లలో 12లక్షల 70వేల 529డాలర్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే బాహుబలి కలెక్షన్లు 13 నుంచి 14 లక్షల డాలర్ల మధ్య ఉన్నాయి.

BAAHUBALI RECORDS Khaidi No 150

ఈ లెక్కన ప్రీమియర్ షోల రికార్డుల్లో బాహుబలి తర్వాతే ఖైదీ నెంబర్ 150 సినిమా ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు టాప్ లో ఉన్న మహేష్, ఎన్టీఆర్ ఇతర కుర్రహీరోల రికార్డుల్ని మాత్రం చిరు దాటేశాడు. ప్రీమియర్షోల ద్వారా ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో బాహుబలి తొలిస్థానంలో ఉండగా.. ఖైదీ రెండో స్థానం,తర్వాత స్థానంలో పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ 3 వ స్థానంలో ఉంది. పవన్ సినిమాకు 6 లక్షల డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో జనతాగ్యారేజ్, బ్రహ్మోత్సవం సినిమాలు ఉన్నాయి.