చిరంజీవి సినిమాపై మంచులక్ష్మి ట్వీట్‌….

105
Lakshmi Manchu Tweet on Khaidi No 150

సుదీర్ఘ కాలం తర్వాత వెండితెరపై ఖైదీ నెంబర్‌ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు. ఏమాత్రం చెక్కు చెదరకుండా అదే స్టైల్‌లో నటించాడు. అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడుతో టాలీవుడ్ రికార్డులను మెగాస్టార్ బ్రేక్ చేశాడు. డ్యాన్సు,యాక్షన్స్‌లతో అదరగొట్టాడు. సినిమా హిట్‌ టాక్‌తో చిరు అభిమానుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌ నటించిన సినిమా టీజర్ దగ్గరి నుంచి సాంగ్స్ వరకు భారీగానే రికార్డులను బద్దలు కొట్టింది.

Lakshmi Manchu Tweet on Khaidi No 150

అయితే ఈసినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన పలువురు దర్శకులు, హీరోలు ట్వీట్టర్‌ ద్వారా మెగాస్టార్‌ను అభినందించారు. తాజాగా ఆ జాబితాలో మంచులక్ష్మి కూడా చేరింది. ఖైదీనెంబర్‌ 150పై మంచు లక్ష్మి స్పందిస్తూ…‘చిరంజీవి 150వ సినిమా చూశా. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పవర్‌ఫుల్‌ మెసేజ్‌ ఇచ్చారు. నిర్మాతగా రామ్‌చరణ్‌ మనం గర్వపడేలా చేశాడ’ని ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా చిరంజీవి పెర్ఫార్మెన్స్‌ను వర్ణించడానికి ఓ కొత్త పదం కనిపెట్టింది. చిరు చింపేశాడు అనడానికి ‘చింపిఫైడ్‌’ అని లక్ష్మి ఓ కొత్తపదం కనిపెట్టింది.

Lakshmi Manchu Tweet on Khaidi No 150

ఖైదీ సినిమా 47.7 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండ‌స్ట్రీ రికార్డును అందుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొద‌టిరోజు 30 కోట్ల 45 వేలు వ‌సూలు చేసింది. క‌ర్నాట‌క -4.70 కోట్లు, ఓవ‌ర్సీస్ (అమెరికా) – 1.22 మిలియ‌న్ డాల‌ర్లు, అమెరికా మిన‌హా మిగ‌తా చోట్ల 3,20,000 డాల‌ర్లు, నార్త్ అమెరికా-8.90 కోట్లు, ఇత‌ర భార‌త‌దేశంలో 2.12 కోట్లు, ఒరిస్సా-12 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు-20లక్ష‌లు వ‌సూలు చేసింది. ఇత‌ర‌చోట్ల ఓ 58ల‌క్ష‌ల వ‌సూళ్లు ద‌క్కాయి“ అని అల్లు అరవింద్‌ తెలిపారు.