మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్ సుందరి..

29
harnaaz

మిసన్ యూనివర్స్ 2021గా నిలిచింది 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్ కౌర్ సంధు. ఇజ్రాయిల్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచి విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

2019లో ‘మిస్ ఇండియా పంజాబ్‌’గా నిలిచారు హర్నాజ్. 17 ఏళ్లకే ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఈ చండీగఢ్ భామకు బాల్యం నుంచే మోడలింగ్‌పై అమితమైన ఆసక్తి. అటు వెండితెరపై కూడా మెరవాలనుకునేది. అందుకే విద్యార్థి దశలోనే సినిమాల్లో నటించడంపై దృష్టిసారించింది. ఆమె నటించిన రెండు పంజాబీ చిత్రాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని సుస్మితాసేన్‌ (1994), లారాదత్తాలు (2000) మాత్రమే సాధించారు. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు హర్నాజ్ సంధు దక్కించుకోవడం విశేషం.