మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు అడుగంటుతున్నాయని మిడ్ మానేరు నుండి నీటిని ఎత్తిపోయాలని లేఖలో పేర్కొన్నారు.
జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకుగాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్నసాగర్‌లో 18 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని నీళ్లు వదలాలని సిద్దిపేట ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు