కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు:హరీష్ టెలీకాన్ఫరెన్స్

275
harishrao
- Advertisement -

కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన హరీష్..కరోనా ఒకరికి వచ్చినా కాంటాక్ట్ అయిన వారందరికీ టెస్టులు చేయాలన్నారు.

సంగారెడ్డి జిల్లాకు అవసరమైన పీపీఈ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, హోం క్వారంటైన్ కిట్లు తెప్పించామన్నారు. కిట్లు లేవని ప్రజలకు సాకులు చెప్పొద్దన్నారు. కరోనా రాకుండా ప్రతి రోజు ఆవిరి పట్టుకోవాలి…. వేడినీళ్లు తాగాలని సూచించారు.

పీహెచ్‌ఎసీలో ప్రతి రోజు టెస్టులు చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని…కరోనాను ప్రాథమిక దశలో గుర్తించకపోవటం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. కరోనా వచ్చిన వారిని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోకూడదని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అధికారులు , వైద్యులు అవగాహన కల్పించాలని అన్నారు.

- Advertisement -