- Advertisement -
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టాప్ గేర్లో దూసుకుపోతోంది బీఆర్ఎస్. ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్,హరీశ్ రావు,కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ లో రోడ్ షో ముగించుకొని, దుబ్బాక వెళ్తున్న సందర్భంగా రిమ్మనగూడ వద్ద గల ఒక హోటల్ వద్ద చాయ్ తాగేందుకు మంత్రి ఆగారు.
ఈ సందర్భంగా హైదారాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న ఒక జంట, అక్కడే ఉండగా, వారి పాపను మంత్రి చేతిలో పెట్టారు. ఈ సందర్బంగా మంత్రి ఆ పాపను ఎత్తుకొని ముద్దాడారు. పాపను చూస్తూ మురిసిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Also Read:CM KCR:హుజురాబాద్ బీఆర్ఎస్దే
- Advertisement -