టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించాం!

5
- Advertisement -

తెలుగుదేశం పార్టీ చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ అన్నారు అహరీశ్‌ రావు. సిద్దిపేట దీక్షా దివస్‌లో మాట్లాడిన హరీశ్‌ రావు…తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇదేమైనా సిగరెటా బిరియానీనా అనిఅవహేళన చేసేవారు అన్నారు. ఇకపై హైదరాబాదుకు వెళ్లాలంటే పాస్పోర్ట్ వీసా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా రెచ్చగొట్టారు…బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ఇక్కడ ఎమ్మెల్యేలను ప్రలోభాల గురిచేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీకి చలనం రాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశాం అన్నారు హరీశ్ రావు.

తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీతో తీర్మానం చేయించింది కేసీఆర్…ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ కూడా మాట మార్చిందన్నారు. బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేసింది…కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటన చేసి తర్వాత మాట మార్చి మోసం చేసింది….తెలంగాణ ప్రజల ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేశారు అన్నారు.

హైదరాబాద్ ఫ్రీ జోనని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది..మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతాయని ఫ్రీ జోన్ పై పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు శ్రీకారం చుట్టింది టిఆర్ఎస్ పార్టీ..అక్టోబర్ 12 2009 సిద్దిపేట అంబేద్కర్ భవన్లో ఉద్యోగ గర్జన సన్నాహాక సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ప్రాణాలు తెగించైనా సరే హైదరాబాద్ ను కాపాడుకుంటామని ప్రకటించారు.

ఆ నినాదమే తెలంగాణ ఉద్యమ రూపురేఖలను మార్చింది. కావలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సిద్దిపేట గడ్డపై నుంచి ప్రకటించారు…కేసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారు….అక్టోబర్ 21 ఉద్యోగ గర్జన పెద్ద ఎత్తున విజయవంతమైందన్నారు. నవంబర్ 29న సిద్దిపేట కేంద్రంగా ఆమరణ దీక్షకు కూర్చుంటానని కేసీఆర్ ప్రకటించారు…నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వీ ర్యం చేసేందుకు వేలమంది పోలీసులకు సిద్దిపేటకు వచ్చారు..ఎముకలు కొరికే చలిలో కూడా వేలమందితో దీక్ష శిబిరాన్ని కాపాడుకున్నాం అన్నారు.

దీక్షా శిబిరానికి వస్తున్న కేసీఆర్ ను కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మంకి తరలించారు. ఖమ్మంలో అయితే తెలంగాణ ఉద్యమం అంతగా ఉండదు అని రోశయ్య గారు ఖమ్మం తరలించారు….కెసిఆర్ గారి అరెస్టుకు నిరసనగా మేము కూడా సిద్దిపేటలో నిరాహార దీక్షకు కూర్చున్నాం అన్నారు. 2000 మంది పోలీసులు వచ్చి దీక్షా శిబిరాన్ని పోల్చి లాఠీచార్జ్ చేసి నాతోపాటు వేల మందిని సిద్దిపేటలో అరెస్టు చేసి మెదక్ జైల్లో పడేశారు…అయినా పోరాటం ఆగలేదు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ,రాజయ్య యాదవ్ , నాయని నరసింహారెడ్డి… కేసీఆర్ గారితో ఖమ్మం జిల్లాలో ఉన్నారు అన్నారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకున్నారు..ఉద్యోగస్తులు, లాయర్లు, ప్రజలు పెద్ద ఎత్తున ఖమ్మం చేరుకున్నారు….డిసెంబర్ మూడో తేదీన కెసిఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తోందన్ని హైదరాబాద్ నిమ్స్ కి తరలించారు అన్నారు.

Also Read:RSP: బీఆర్ఎస్ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కండి

తెలంగాణ సమాజం కేసిఆర్ కు ఏమన్నా అయితదమో అని భయపడింది..అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేకపోతే కెసిఆర్ శవయాత్ర అని పట్టుదలతో కూర్చున్నారు…కెసిఆర్ గారికి ఏమైనా అయితే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. తెలంగాణ సమాజమంతా ఏకమైంది అన్న విషయం తెలుసుకున్నది ఢిల్లీ కాంగ్రెస్..కేంద్ర హోం మంత్రి చిదంబరం… జయశంకర్ సార్ తో ఫోన్లో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తానని, దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ..ప్రకటన వచ్చిన తర్వాతే దీక్ష విరమిస్తానని కెసిఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

- Advertisement -