Harishrao:జహీరాబాద్‌లో రెండోసారి విజయం

39
- Advertisement -

జహీరాబాద్‌లో రెండోసారి విజయం సధించామన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. జహీరాబాద్ బీ ఆర్ ఎస్ కృతజ్ఞత సభలో మాట్లాడిన హరీష్ రావు…ఉమ్మడి మెదక్ జిల్లా లో ఏడు సీట్లు గెలుచుకుని మంచి ఫలితాలు సాధించాం అన్నారు. ప్రభుత్వం లోకి రాలేమన్న బాధ ఉన్నా ..ఇక కార్యకర్తలు దాన్ని మరచిపోవాలన్నారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజం అని…బీ ఆర్ ఎస్ త్యాగాల పార్టీ ..పదవులను గడ్డి పోచల్లా వదలి పెట్టాం అన్నారు.

రానే రాదనుకున్న తెలంగాణ తెచ్చాము ..వచ్చిన తెలంగాణ ను బాగా అభివృద్ధి చేసుకున్నాం అని తెలిపారు. ఇలాంటి సమయాల్లో కార్యకర్తలు దైర్యంగా ఉండాలని….నైతిక స్థైర్యాన్ని కోల్పోవద్దన్నారు. కొన్ని రోజుల్లోనే ఏది మంచో ఏది చెడో ప్రజలు గ్రహిస్తారని…బీ ఆర్ ఎస్ పాలక పక్షం లో ఉన్నా విపక్షం లో ఉన్నా ఎపుడూ ప్రజల పక్షమే అన్నారు. .కష్టపడి పని చేద్దాం ..కలసి కట్టుగా మళ్ళీ విజయం సాధిద్దాం అన్నారు. స్థానిక ,పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి ఇప్పట్నుంచే కృషి చేద్దాం అని పిలపునిచ్చారు.

సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం అన్నారు. పార్టీ లో సీనియర్ల సేవలు ,కార్యకర్తల సేవలను తగిన విధంగా వాడుకుంటాం అని…..పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేద్దాం అన్నారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయాం అన్నారు.

Also Read:ఏపీపై కాంగ్రెస్ ప్లాన్ అదే!

- Advertisement -