దేశంలోనే క్రైస్తవుల కోసం క్రిస్టమస్ పండుగను అధికారికంగా జరుగుతున్న ప్రభుత్వం టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు . సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పట్టణం జీఎంఆర్ గార్డెన్స్‌లో ప్రభుత్వం తరపున క్రైస్తవులకు బట్టలు మరియు గిఫ్ట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ..పేద ధనిక అనే తేడా లేకుండా అందరు పండుగ జరుకోవలని ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు కొత్త బట్టలు ఇస్తున్నామని చెప్పారు.క్రైస్తవుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందన్నారు.
క్రీస్తు బోధనలను నిత్య జీవితంలో ఆచరించాలన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. క్రైస్తవుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Telangana Minister Harishrao speech at Sangareddy christamas gifts distribution..Telangana Minister Harishrao speech at Sangareddy christamas gifts distribution