ట్రెండింగ్‌: మహేశ్ బాబు భార్యతో రాంచరణ్‌ సెల్ఫీ..!

629
ram charan
- Advertisement -

హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కొడుకు – టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లి వివాహం ఇటీవలె హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అసద్ -ఆనమ్‌ల వివాహానికి టాలీవుడ్,బాలీవుడ్ ప్రముఖులే కాదు వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

ఇక ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ అతని భార్య ఉపాసన,మహేష్ బాబు వైఫ్ నమ్రతా శిరోద్కర్‌. ఈ పార్టీలో నమ్రతా,ఉపాసనతో రాంచరణ్‌ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సానియాతో తనకున్న సన్నిహిత సంబంధానికి గుర్తుగా ఈ పోటోలను,రాంచరణ్ డ్యాన్స్ చేసిన వీడియోలను షేర్ చేసింది ఉపాసన. ఇక నమ్రతా-ఉపాసన సైతం బెస్ట్ ఫ్రెండ్స్‌. వీరిద్దరు ఏపార్టీలో కలిసినా సందడే. సానియా చెల్లి పెళ్లిలోనూ వీరు హంగామా చేసి అందరిని ఉత్సాహ పర్చారు. ఇక ప్రస్తుతం ఈ పోటోలు సోసల్ మీడియాలో వైరల్‌గా మారగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Ram Charan and his wife Upasana were seen taking a selfie with mahesh Babus wife Namrata Shirodkar at the Sania siste anam wedding.

- Advertisement -