రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్ గారికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షో పాల్గొని ప్రసగించారు. కాంగ్రెస్, బీజేపీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నయన్నారు. బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన సముద్రంలా ఉన్నాయని..
సమైక్య వాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారన్నారు.
మానుకోటకు మట్టికి దండం మానుకోట రాళ్లకు దండం పెట్టాలన్నారు. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరిగెత్తారని..మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తుండ్రు. వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలన్నారు. కార్యకర్తలు మంచిగా పని చేసి శంకర్ నాయక్ ని మూడోసారి గెలిపించాలన్నారు. మానుకోట రోడ్లు సిద్ధిపేట కంటే బాగున్నాయి. గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? హార్టికల్చర్ కాలేజ్ వచ్చేదా? తండాలు గ్రామ పంచాయితీలు అయ్యేవా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? ఆలోచించాలన్నారు.
రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాల్నా? అని ఎద్దేవా చేశారు. బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా?…నాడు కాల్వల్లో తుమ్మచెట్లు మొలిచినయి. నేడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయన్నారు బోరింగులు మాయమైపోయినయి. ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నయని..నాడు దొంగ కరెంటు కోసం బాయి కాడ పండుకున్న రోజులు మర్చిపోయిండ్రా? ఆలోచించాలన్నారు. ఉచిత కరెంటు అని చెప్పి ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకు ఓటు గుద్దు. రిస్క్ వద్దు కారుకు గుద్దు అన్నారు. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసింది. కేసీఆర్ చేసిన కృషి వల్ల రైతు బంధు డబ్బులు సోమవారం రోజు ఖాతాల్లో పడతాయన్నారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తారన్నారు. కాంగ్రెస్ మోసం చేసే పార్టీ. కేసీఆర్ అంటే మాట తప్పనోడు అన్నారు. ఇప్పటివరకు 90 శాతం హామీలను నెరవేర్చాం. రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తాం అని తెలిపారు.
Also Read:KTR:కామారెడ్డిలో పరిశ్రమల ఏర్పాటు