Harishrao:చేరికలేనా..రైతు సమస్యలు పట్టవా?

26
- Advertisement -

నిన్నటి వరంగల్ పర్యటన లో రైతుల కన్నీళ్ళు కష్టాలు కనిపించాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన అక్కడ కొంత మంది ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు రావటం లేదని, లక్షలు పోయాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పుడు కనీసం మా తాండాల్లో తాగు నీరు కూడా రావటం లేదని ఆవేదన చెప్తున్నారన్నారు.

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని..ఓ సమీక్ష లేదు, పరామర్శ లేదన్నారు. అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని…చేరికల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒక్క రైతును కూడా పరామర్శించలేదన్నారు. కేసిఆర్ హయం లో బోర్లు లేవు, క్రేన్లు లేవు…పంటలు ఎండిపోయి, రైతుబంధు రాక, వడగళ్ల వానతో పంటలు నష్టపోతుంటే అప్పులు కట్టాలని బ్యాంకులు రైతులను వేధిస్తున్నారన్నారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.

Also Read:క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:మహేష్‌ గౌడ్

- Advertisement -