మెదక్ బీజేపీ అభ్యర్థిపై ఫిర్యాదు చేస్తాం:హరీష్

11
- Advertisement -

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన హరీష్…ఫేక్ వీడియోలతో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో దుబ్బాకలో ఇదే తరహాలో ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని, బీజేపీ చేసే అబద్ధాలు, గ్లోబల్ వీడియోలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. వెంకట్రా మిరెడ్డి మచ్చలేని మనిషి, తెల్ల పేపరు లాంటి వ్యక్తి అని…అందరు ఆస్తులు సంపదించుకోవాలనుకుంటే అతను ఆస్తి పంచి పెడుతమంటున్నాడని వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం…. పోలీసులు స్టేషన్‌లో కేసు పెడతామని స్పష్టం చేశారు. వెంకట్రామిరెడ్డికి జనంఅడుగు అడుగునా నీరాజనం పలుకుతున్నారని…మెదక్‌లో గెలిచేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు.

Also Read:పుష్ప… ఫుల్ లిరికల్ వచ్చేసింది

- Advertisement -