Harishrao:ప్రభుత్వ వైఫల్యంతోనే పంట నష్టం

22
- Advertisement -

ప్రభుత్వ వైఫల్యంతోనే పంట నష్టం జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా లో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లో కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టం…కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదు అన్నారు.

దొంగలు పడ్డాక అరు నెళ్లకు కుక్కులు మోరిగినట్లుగా సర్కారు తీరు ఉందని… కేసీఆర్ పొలం బాట పట్టకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచిందన్నారు.వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని…ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారన్నారు. రైతులను దగా చేసింది కాంగ్రెస్…వంద రోజుల తరువాతే కోడ్ వచ్చింది, పంటలకు ఇస్తామన్న బోనస్ యసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు.

రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి… తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బోగస్ మాటలు మాట్లాడుతున్నారు…ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శించే హక్కు లేదు అన్నారు. దొడ్డిదారిన అధికారంలో కు వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును విస్మరించింది.. కాంగ్రెస్ హమిల విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం అన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే…

- Advertisement -