- Advertisement -
తెలంగాణలో అకాల వర్షం బీభత్సం చేసింది. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. వందలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. యార్డుల్లో ధాన్యం తడిసిముద్దైంది.
కొమరవెల్లి మండలం గౌరాయపల్లిలో వడగండ్ల వానతో నష్టపోయిన బాధిత రైతులను కలిశారు మంత్రి హరీష్. పంటపొలాలను పరిశీలించిన ఆయన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆడుకుంటారని చెప్పారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం వివరాలను వెంటనే తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు.
- Advertisement -