రైతులకు ఉచిత విద్యుత్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రైతు వ్యతిరేకి అయిన కాంగ్రెస్‌కు కరెంట్ షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన హరీష్…రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ..ధరణి వద్దు..రైతు బంధు వద్దు..ఉచిత కరెంటు వద్దు..!రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారి పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని మండిపడ్డారు.
Also Read:రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్..
నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడు.పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Also Read:విషాదం : ఆ నటి, ఆ యాంకర్ మృతి