టుడే టాలీవుడ్ వైరల్ కంటెంట్ 

43
- Advertisement -
టాలీవుడ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కంటెంట్ విషయానికి వస్తే.. జాతిరత్నాలు ఫేం న‌వీన్ పొలిశెట్టి , అనుష్కా శెట్టి   టైటిల్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌‌ను విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, అనుష్కను ఫాలో అవుతూ పాడుకుంటున్న ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘ఎందుకంత ఇష్టం నేనంటే ..’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ వీడియో సాంగ్ ప్రెజెంట్ వైరల్ లిస్ట్ లో టాప్ లో ఉంది.
https://www.youtube.com/watch?v=SHgl-aoDINw
 అలాగే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మిస్తోన్న  ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో హరీశ్ కళ్యాణ్ హీరోగా, ఇవానా హీరోయిన్‌గా నటించింది. రమేశ్ తమిళమణి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నదియా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కూడా వైరల్ అవుతుంది. మరి మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
https://www.youtube.com/watch?v=i1tURJczuCI
అలాగే వైరల్ అవుతున్న మరో  వీడియో కంటెంట్ విషయానికి వస్తే..  గత ఆరు సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్-7 ప్రోమో రిలీజ్ అయింది.  రెడీగా ఉండండి… ఎమోషన్ల ఎత్తుపల్లాల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్-7 వచ్చేస్తోంది అని స్టార్ మా చానల్ పేర్కొంది. అయితే అసలు ఎప్పటి నుంచి ఈ షో ప్రసారమవుతుంది.. హోస్ట్‌గా ఎవరు చేస్తారనే వివరాలేమీ వెల్లడించలేదు. ప్రోమో మాత్రం వైరల్ అవుతుంది.
- Advertisement -