పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్లు జరగడం లేదని హరీశ్‌రావు తెలిపారు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోరు అని ధ్వజమెత్తారు. మంత్రి సీతక్క సొంత జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరించరని పేర్కొన్నారు.
పాలన గాలికి వదిలి, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళకు మంత్రి సీతక్క, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్యూ కట్టిన పరిస్థితి ఉందన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి @UttamINC గారి సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవు.
బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి @Bhatti_Mallu గారు పట్టించుకోరు.
మంత్రి @seethakkaMLA గారి జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక… pic.twitter.com/O4fWaIuBKP
— Harish Rao Thanneeru (@BRSHarish) November 9, 2024
Also Read:తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు!