- Advertisement -
తెలంగాణ విప్లవ శరధిలో ఎగిసిపడిన కవిత్వ తరంగం, ధిక్కార శతఘ్ని దాశరథి కృష్ణమాచార్యలు గారి శత జయంతి సందర్భంగా ఘన నివాళి అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాశరథి గారు జైలు గోడల మీద బొగ్గుముక్కతో రాసిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అజరామరమై నేటికీ స్ఫూర్తినందిస్తుందన్నారు.
మహోన్నతమైన దాశరథి స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను తొలి సిఎం కేసీఆర్ గారు ప్రకటించిన విషయం విదితమే.తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకం అన్నారు హరీశ్ రావు.
Also Read:కేటీఆర్ బర్త్ డే..కేసీఆర్ కిట్‌ల పంపిణీ
- Advertisement -

