పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదేనని ఎక్స్ వేదికగా తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు అని వీడియో షేర్ చేశారు.
రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు అన్నారు. ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండటం లేదు అన్నారు.
సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం…. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉంది అని తెలిపారు సజ్జనార్.
పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!?
సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు.
రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు.
ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి… pic.twitter.com/MUOyxuQCiN
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 22, 2025
Also Read:త్వరలో #VT15 ఫస్ట్ లుక్

