HCL ఛైర్మన్‌గా రోషిణి

5
- Advertisement -

HCL ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు రోషిణి నాడార్.భారతదేశ చరిత్ర లో ఒక మహిళ, ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవ్వటం ఇదే తొలిసారి. రోషిణి 2017 నుంచి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో ఒకరు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత మహిళా ధనవంతురాలుగా ఉన్నారు.

HCL (హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్) ని స్థాపించిన శివ నాడార్ ఏకైక కుమార్తె రోషిణి. విద్యాగ్యాన్ అనే సంస్థని స్థాపించింది. చాలా మంది వేరే వాళ్ళకి సహాయం చేసి ఫోటోలు దిగుతారు. ఈమె మాత్రం తాను సహాయం చేసిన వాళ్ళు నాయకులు గా ఎదగాలి, పెద్ద పెద్ద సంస్థల్లో లీడర్లు గా ఎదగాలి, భారతదేశాన్ని నడిపించాలి, అప్పుడు తాను వెళ్ళి వాళ్ళతో ఫోటోస్ దిగాలి అంటుంది.

1976 లో HCL ని స్థాపించిన శివ నాడార్ ది కూడా విలక్షణ వ్యక్తిత్వం. తమిళనాడు లోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టిన శివనాడార్ చదువు అంతా సామాన్యమైన పాఠశాల, కాలేజ్ లే. చదువు అయ్యాక ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి HCL ని స్థాపించాడు. కంప్యూటర్స్ అంటే మన దేశం లో చాలా మందికి తెలియని కాలం లో వాటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకోసం హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (HCL) ని 1976 లోనే స్థాపించాడు. HCL భారతదేశం లో TCS, Infosys తర్వాత మూడో అతి పెద్ద ఐటీ కంపనీ. లక్షా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

Also Read:టీటీడీ పాలకమండలి సమావేశం

- Advertisement -