సిద్దిపేటలో యోగా డే…పాల్గొన్న హరీశ్ రావు

439
harish yoga
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 5వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. రాజ్‌భవన్‌లో జరిగిన యోగా డే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొనగా పలు జిల్లాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటున్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో యోగ దినోత్సవం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఔత్సాహికులతో కలిసి హరీశ్ రావు యోగసనాలు వేశారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని పిలుపునిచ్చారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.

అమెరికా లాంటి అభివృద్ధి చెందినా దేశాల్లో మన దగ్గర యోగ నేర్చుకొని వారు నిత్య జీవితంలో యోగని భాగస్వామ్యం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, అత్యున్నత స్థాయిలో ఉండే పీఎం లు, సీఎం లు, సీఈఓ లు వారు కూడా యోగను అభ్యసిస్తున్నారని చెప్పారు.

చాలా మంది ఫ్రీగా వచ్చేదాన్ని చులకనగా చూస్తారు కానీ ఇది చాలా ముఖ్యమైనది, ఆరోగ్యంమే మహాభాగ్యం అన్నారు. మనిషికి అన్నింటికంటే ముఖ్యమైంది ఆరోగ్యం …ఆరోగ్యాన్ని డబ్బులతో కానీ వైద్యులతో కానీ తెచ్చుకోలేమన్నారు.,ఒక్కరోజులో 30 నిముషాలు యోగా కు కేటాయిస్టే
,మంచి ఆరోగ్యంను ప్రశాంతతను పొందగలుగుతామన్నారు.

యోగాతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరగలుగుతారని చెప్పిన హరీష్‌..పాఠశాల స్ధాయి నుండే యోగా ను అభ్యసించగలుగుతే వారి జీవితం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.ధ్యానం, యోగా వల్ల ఏకాగ్రతను పెంచుకోగలుగుతారని చెప్పారు.అంతకుముందు పుస్తకావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్సేన్ సాగర్ లోని బుద్దుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమంలోమంత్రి శ్రీనివాస్ గౌడ్, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు.

- Advertisement -