Harish:ఇది కదా అసలైన మార్పంటే?

4
- Advertisement -

మేడిగడ్డ టు మల్లన్న సాగర్ – మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరంలో నీటి వినియోగం 240 TMC అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 TMC మాత్రమేనట,కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట అని ఎక్స్‌లో మండిపడ్డారు.

35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం…కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం..ఇది కదా అసలైన మార్పంటే? అన్నారు హరీశ్‌.

Also Read:Asia Cup:సూపర్-4కు ఆ నాలుగు జట్లు

- Advertisement -