ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో తలపడే జట్లు ఏంటో తెలిపోయాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, గ్రూప్ బి నుండి న శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4కు చేరుకున్నాయి. వరుసగా మూడు విజయాలతో గ్రూప్-బి టాపర్‌గా సూపర్ 4లో అడుగుపెట్టింది.
సూపర్ 4లో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. టీమ్ఇండియా 21న పాక్‌తో, 24న బంగ్లాదేశ్‌తో, 26న శ్రీలంకతో ఆడనుంది.
సెప్టెంబర్ 20న – శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుండగా సెప్టెంబర్ 21న – భారత్ వర్సెస్ పాకిస్తాన్, సెప్టెంబర్ 23న – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, సెప్టెంబర్ 24న – భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, సెప్టెంబర్ 25న – పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, సెప్టెంబర్ 26న – భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
Also Read:కిష్కింధపురి..ఇండస్ట్రీ సక్సెస్!

