రేవంత్ రెడ్డి SBI బ్యాంక్ తీసేసి కొండల్ రెడ్డి బ్యాంక్ పెడతాడు అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్.. రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పగబడుతాడు అన్నారు.
ఎస్బీఐకి ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మేసి, ఇవాళ ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తా అంటున్నాడు.. రేపు ఆర్బీఐ, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినకపోతే వాటిని కూడా నిషేదిస్తా అంటాడు అని ఆరోపించారు.
అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతుండగా సడెన్‌గా పవర్ కట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో దేవుళ్ల మీద ప్రమాణం చేసి మోసం చేసిన వీడియోలు సభా వేదికగా స్క్రీన్‌పై కార్యకర్తల ముందు ప్రదర్శిస్తున్న సమయంలో ఇలా కరెంట్ పోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Also Read: కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!

