KTR:చిట్టినాయుడికి చుక్కలు చూపిస్తాం

0
- Advertisement -

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారిని వదిలిపెట్టం అని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిట్టి నాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది అన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి కేంద్రం అన్ని పంటలను కొనాల్సిందే అని తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడి..ఇప్పుడు కేంద్రం ఎంత చెప్తే అంతే కొంటాం అంటూ బుడ్డర్ ఖాన్ మాటలు చెప్తుండు. కేంద్రంలోని మోడీ ఇచ్చిన కోటా ప్రకారమే
రైతులు పండించిన పంటను కొంటానని చెప్తున్నావ్.. మరి నువ్వేం చేస్తావ్? సీఎంగా నువ్వెందుకు ఉన్నావ్? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మనమీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు.

రిటైరైనా పారిపోయినా సప్తసముద్రాల అవతల దాక్కున్నా.. ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కడిని వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత నాది.. వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. ఇది నేనేం ఊరికే చెప్పడం లేదు.. గుర్తు పెట్టుకోండి. కానీ రమేశన్న వీడు మంచోడేనే అన్నా అని మళ్లా వారిని తీసుకొని రావొద్దని కేటీఆర్ సూచించారు.

Also Read:కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!

- Advertisement -