అమెరికా ఫైటర్ జెట్‌ను పేల్చేసిన ఇరాన్!

12
- Advertisement -

అమెరికాకు చెందిన అత్యాధునిక F-35 Lightning II యుద్ధ విమానం దెబ్బతినడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు Iran కాల్పులే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం ప్రకారం, అమెరికా వైమానిక స్థావరానికి చెందిన ఈ ఫైటర్ జెట్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం గాల్లో ఉన్న సమయంలోనే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇరాన్ వైపు నుంచి జరిగిన కాల్పుల కారణంగా ఈ విమానం దెబ్బతిన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రాలేదు.

ఈ ఘటనలో విమానం నడిపిన పైలట్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని పేర్కొన్నారు.ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ అమెరికా యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

Also Read:మెగాస్టార్‌ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ సంఘటన పరిస్థితిని మరింత క్లిష్టం చేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -